ఎట్టకేలకు తన విడాకుల వార్తలపై స్పందించిన హార్థిక్

ఎట్టకేలకు తన విడాకుల వార్తలపై స్పందించిన హార్థిక్

 

గత ఐపీఎల్ సీజన్ సమయంలో హార్థిక్ పాండ్యా పేరు బలంగా వినిపించింది. హార్థిక్ చాలా రోజులుగా అందరి ప్రశంసలు అందుకునేలా ఆడాడు. కానీ ఐపీఎల్ లో ఘోరమైన ఫామ్ తో విమర్శళు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్య నటాషాతో విడాకులు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. భరణం కూడా ఇచ్చాడంటూ రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. 

అయితే ఆ తర్వాత నటాషా పదిహేను రోజుల క్రితం ఓ పోస్టు చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో ఆడుతున్న హార్తిక్ బాగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మొన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలిచింది. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసించారు. 

హార్థిక్ తో సరదాగా ముచ్చటించాడు రికీ పాంటింగ్. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

హార్దిక్ పాండ్యా: రికీ..! అంతా ఎలా జరుగుతోంది? మీ కుటుంబం ఎలా ఉంది
రికీ పాంటింగ్: వాళ్లంతా కూల్‌గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు?
హార్దిక్ పాండ్యా: అంతా బాగానే ఉంది. ఆల్ స్వీట్ అంటూ చెప్పాడు. 

అంటే హార్థిక్ మాటలను బట్టి తాను ఇంకా విడాకులు తీసుకోలేదని తెలుస్తోంది. కలిసే ఉన్నారని అంటున్నారు వారి అభిమానులు.

Related Posts