మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ.68,300గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ(మంగళవారం) తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ.68,300గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,450గా ఉంది. 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ.74,660 ఉండగా ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,300గా ఉంది. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,510గా కొనసాగుతోంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,840 ఉంది.