ఏడు బంగారు పథకాలు సాధించిన రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు

WhatsApp Image 2024-07-24 at 10.19.49_f4070d89

విశ్వంభర, యూసుఫ్ గూడా : అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2024 యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం   నిర్వహించబడింది.ఈ టోర్నమెంట్‌లో రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ కౌకూర్ గ్రీన్‌వుడ్ హైట్స్ అపార్ట్‌మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.మాస్టర్ శ్వేత  విధార్థులు మాన్య కత్వా, షానయ వీర్ ,  సాయిధృవ్ సిద్ధార్థ్, బి.రణవీర్, బి.శ్రేయస్, అవనీ పాండే, హిమేష్ వర్మ  జూనియర్ మరియు సబ్ జూనియర్ విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు.ఈ సందర్బంగా మాస్టర్ శ్వేత  మాట్లాడుతు తన విధార్థులు 7 బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రణ్‌వీర్ తైక్వాండో అకాడమీలో 70 మంది విద్యార్థులు అందరు బంగారు మరియు వెండి పతకాలు గెలిచి మెగా కప్ సాధించినందుకు గర్వంగా ఉందనీ అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ తప్పకుండా నేర్చుకోవాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి