రాహుల్ ప్రధాని కావడం ఖాయం.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి గెలవడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతు రావు అన్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్డీఏ పని అయిపోయిందని ఆయన జోస్యం చెప్పారు. బీజేప బలహీన పడుతున్నా.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా 400 సీట్లు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అయితే ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
కారణం లేకుండా రాహుల్ గాంధీని విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, ప్రజలు ఈసారి బీజేపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీకి దేశం విడిచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని వీహెచ్ చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని అయితే.. బీజేపీ నేతలే దేశం దాటి పారిపోతారని అన్నారు. మోడీకి ఇండియా కూటమికి బయపడుతున్నారని.. అందుకే మతరాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.
పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అంబానీ, అదానీకి తప్ప పేదలకు ఏం చేశారని వీహెచ్ నిలదీశారు. మణిపూర్ ఘటనపై ఇంతవరకూ మోడీ నోరు విప్పలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ గాలి బుడగలాంటిదని అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ నేతలే వాస్తవాలను గ్రహిస్తారని చెప్పారు. చాలాచోట్ల బీజేపీకి డిపాజిట్లు కూడా రావని వీహెచ్ జోస్యం చెప్పారు.