వృద్ధురాలి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ 

వృద్ధురాలి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ 

ఒడిశాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపరాలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఓ వృద్ధురాలి కాలును ప్రధాని మోడీ మొక్కారు. ఆమె కాలుపై మోడీ తన తలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోను బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'నేను మీ సేవకుడ్ని, నేను మీ కుమారుడిని' అని ట్యాగ్ చేసింది. మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని రాసుకొచ్చింది. 

 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

బీజేపీకి మూడో సారి అధికారంలోకి తీసుకురావడానికి మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన ఈసారి ప్రచారం చేశారు. టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇవాల్టితో ప్రచారం కూడా ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేయడానికి వెళ్లనున్నారు. 48 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. అయితే.. ధ్యానం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.

Related Posts