మోడీ వల్లే ఎన్డీయే విజయం.. పవన్ కల్యాణ్‌ ప్రశంసలు..!

మోడీ వల్లే ఎన్డీయే విజయం.. పవన్ కల్యాణ్‌ ప్రశంసలు..!

 

మోడీ ఉన్నంత కాలం ఏ దేశానికి తలవంచం
ఆయన నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది

 

దేశంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. మోడీ సర్కార్ మూడోసారి కొలువుదీరబోతోంది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు రాలేదు. కానీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఢిల్లీలో ఎన్డీయే పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

ఇందులో పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఢిల్లీలోని ఎన్డీయే 3.0 కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోడీ నాయకత్వానికి ఎన్డీయే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. మోడీ ఉన్నంత కాలం ఇండియా ఏ దేశానికి కూడా తలొగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్‌. ఆయన నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా భావిస్తున్నట్టు చెప్పారు.

ఇక మోడీ సలహా వల్లనే ఎన్డీయే ఘన విజయం సాధించిందని పవన్ అన్నారు. ఆయనకు ఎన్డీయే పక్షాల సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు. రాబోయే ఐదేండ్లు ఎన్డీయే పరిపాలన దేశాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు పవన్ కల్యాణ్‌.  

Related Posts