ఆ రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..

ఆ రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్..

 

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నియామకం అయ్యారు. దాంతో ఆమె మీద చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి. వాటన్నింటికీ ఆమె తన బడ్జెట్ తో సమాధానం చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం వంద రోజుల షెడ్యూల్ ను రచిస్తోంది. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

దానికి అనుగుణంగానే జూలై 22న కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మోడీ 3.O అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్పించిన మొదటి సమగ్ర బడ్జెట్ ఇదే. వాస్తవానికి ఎన్నికలకు ముందే మధ్యంతర బడ్జెట్ ను ఆగమేఘాల మీద ప్రవేశ పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో దాన్ని అప్పుడు ఎన్నికల కోడ్ వల్ల పెట్టలేకపోయారు. 

అయితే ఇప్పుడు ఎన్నికలు ముగసిన తర్వాత వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం దేశంలో సాగు రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలు, ద్రవ్యోల్పణం, ఆర్థిక ఏకీకరణ లాంటి వాటికి పెద్ద పీట వేయనున్నట్టు తెలుస్తోంది న్ను సమ్మతి భారాన్ని తగ్గించడం కూడా ప్రభుత్వ ఎజెండాలో భాగమని భావిస్తున్నారు. ఇక మోడీ చెప్పిన 100 రోజుల ప్రణాళికలోని అంశాలను పొందుపరిచే అవకాశం ఉంది.

Related Posts