విడాకులు కోరుకుంటున్న హార్ధిక్ పాండ్య? 

విడాకులు కోరుకుంటున్న హార్ధిక్ పాండ్య? 

సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రతీ చిన్న విషయం వైరల్ అవుతుంది. చిన్న పొరపాటు జరిగినా దాన్ని క్షణాల్లో పట్టేసి వైరల్ చేస్తారు నెటిజన్లు. వారి జీవితాల్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తే దానికి కారణం ఏమై ఉంటుందని చాలా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి సంచలన పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. హార్ధిక్ ప్రేమ, పెళ్లి సినిమాటిక్‌గా జరిగాయి. హార్దిక్, నటాషాను ఓ హోటల్‌లో కలవడం.. తర్వాత అది స్నేహంగా మారడం.. కొన్నాళ్లకే వారి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది.

ఇద్దరు కొన్ని రోజులు డేటింగ్‌లో ఉన్నారు కూడా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పెళ్లి జరిగి నాలుగేళ్లు అవుతోంది. హార్ధిక్, నటాషా ప్రేమకు గుర్తుగా 
ఓ బాబు కూడా పుట్టాడు. ఇంత వరకూ బాగానే ఉన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. దానికి బలమైన కారణాలే చెబుతున్నారు. నటాషా పుట్టిన రోజున హార్దిక్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు. కనీసం విష్ కూడా చేయలేదు. గతంలో హార్దిక్ రెగ్యులర్‌గా ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేసేవాడు. చాలా రోజులుగా అలాంటి ఫోటోలు కూడా లేవు. దీంతో వీరు త్వరలో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని సినీ, క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Read More కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

దీనికితోడు ముంబై ఇండియన్స్ ఈసారి ఘోర పరాభావంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనికి కూడా కారణం హార్దిక కుటుంబ సమస్యలే అనేవాళ్ల కూడా లేకపోలేదు. కుటుంబ కలహాల కారణంగానే హార్థిక్ గేమ్‌పై పూర్తిగా ఫోకస్ చేయలేదని అంటున్నారు. అయితే నటషా మాత్రం ఇంతవరకూ తన ఇన్ స్టా నుంచి హార్దిక ఫోటోలను డిలీట్ చేయలేదు. మరి ఇవన్నీ నిజాలా.. కేవలం పుకార్ల అనేది తేలాల్సి ఉంది.