మండోలి జైలు నుంచి సుఖేశ్ మరో సంచనలన లేఖ విడుదల

మండోలి జైలు నుంచి సుఖేశ్ మరో సంచనలన లేఖ విడుదల

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి రూ. 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయిన  సుఖేశ్ చంద్రశేఖర్ మండోలి జైలు నుంచి మరో సంచలన లేఖను విడుదల చేశారు.

విశ్వంభర, వెబ్ డెస్క్ : రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి రూ. 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయిన  సుఖేశ్ చంద్రశేఖర్ మండోలి జైలు నుంచి మరో సంచలన లేఖను విడుదల చేశారు. అప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ దాడి చేసిన ఘటనలో అరవింద్​ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ జైలు నుంచి లేఖలు రిలీజ్ చేశాడు.

మిమ్మల్ని ఆరాధించే మహిళపై మీరు దాడి చేసిందుకు సిగ్గు పడండి. ఆమె మీ తప్పుడు చర్యలలో ఒక అంశంపై తన స్వరాన్ని పెంచినందుకే మీరు అమెపై దాడి చేసే స్థాయికి దిగజారారు. మీ అసలు రంగు ఇదే అంటూ లేఖలో కేజ్రీవాల్ పై విరుచుపడ్డారు. నీ అసలు రంగుల్లో ఒకటి బహిర్గతం చేసినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక్షంగానో పరోక్షంగానో ఏ స్త్రీ పైన చేతులు ఎత్తే హక్కు మీకు లేదు అని లేఖలో పేర్కొన్నారు. మీ ఇంట్లో మహిళలు ఉన్నారు, మీకు ఒక కూతురు ఉంది.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

మీరు ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో నేను చూశాను. స్వాతి మలివాల్ కూడా కూతురు లాంటిదే కదా ఆమె  ఈ దేశానికి చెందిన వ్యక్తే కాదా ఆమెతో మీరు వ్యవహరించిన తీరు క్షమించరానిదన్నారు. మహిళలపై జరిగిన ఈ క్రూరమైన  చర్చలను సుమోటోగా స్వీకరించి కేజ్రీవాల్ అతని అననుచరుడు బిభవ్ కుమార్ పై చట్ట ప్రకారం శిక్ష విధించేలా దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు హోం శాఖ కు విజ్ఞప్తి చేశారు.

Related Posts