ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ

ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.7 కోట్ల విదేశీ నగదు అందుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు వెల్లడించింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నిధులు అందుకున్నట్లు తెలిపింది. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ (FCRA)ను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ దేశాల నుంచి.. ఆప్‌కు ముడుపులు అందాయని ఈడీ వెల్లడించింది. కాగా, కేంద్ర ఏజెన్సీ గతవారం మద్యం పాలసీ కేసులో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది.

Related Posts