ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే వీళ్లపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు.
అయితే, ఇటీవల వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వరుసగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు.