ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం...నాగబాబు షాకింగ్ కామెంట్స్

ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం...నాగబాబు షాకింగ్ కామెంట్స్

విశ్వంభర, సినిమా : ; పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ ఫలితాలపైనే ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయాని,అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా అనే దానిపై బెట్టింగులు సైతం జరగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

కూటమి కార్యకర్తలు, నేతలకు పలు సూచనలు చేశారు. వైసీపీ ఓటమి తట్టుకోలేక కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని... జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని..కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దని, సంయమనం పాటించాలని కోరారు.

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు