పవన్ కల్యాణ్ కి సరి తూగే హీరో ఇండస్ట్రీలో లేడు: విజయేంద్ర ప్రసాద్

పవన్ కల్యాణ్ కి సరి తూగే హీరో ఇండస్ట్రీలో లేడు: విజయేంద్ర ప్రసాద్

 

పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆయన అభిమానులు. ఎన్ని ప్లాట్లు వచ్చినా ఆయన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరదు. అయితే ఇండస్ట్రీలో అగ్ర హీరో అయిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రాజమౌళితో ఒక్క సినిమా కూడా చేయలేదు. వాస్తవానికి త్రిబుల్ ఆర్ సినిమా ముందు పవన్ కళ్యాణ్ తోనే చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఆ మూవీలో నటించగా అది చాలా పెద్ద హిట్ అయింది. 

అయితే రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఎందుకు చేయలేదని ఆయన అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఇదే అంశాన్ని రాజమౌళిని అడగాలని చాలామంది అనుకున్నా కుదరలేదు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం రీసెంట్ గా అడిగారు. పవన్ కళ్యాణ్ తో ఎందుకు చేయలేదు అని అడగ్గా ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. త్రిబుల్ ఆర్ సినిమా సింగిల్ హీరోది కాదు. ఇది మల్టీ స్టార్లర్ సినిమా. 

సింగల్ హీరో తో చేసేది ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పేవాళ్లం. ఒకవేళ మల్టీ స్టార్ సినిమాను ఆయనతో చేద్దాం అనుకుంటే ఆయనకు సరితూగే హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరు. ఆయన ఇమేజ్ ని వేరే హీరోలు మ్యాచ్ చేయలేరు. అందుకే ఆయనతో త్రిబుల్ ఆర్ చేయలేదు అంటూ చెప్పవచ్చారు విజయేంద్ర ప్రసాద్.

Related Posts