మద్యం బాటిల్ చూడగానే మైమరిచిపోయిన యాంకర్ రష్మీ.. ఫోటోలు వైరల్! 

మద్యం బాటిల్ చూడగానే మైమరిచిపోయిన యాంకర్ రష్మీ.. ఫోటోలు వైరల్! 

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే ఈమె సోషల్ మీడియా వేదికగా మూగజీవాలకు ఎవరైనా హాని కలిగిస్తే వెంటనే వారికి శిక్ష పడాలి అంటూ జంతువులకు మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఇలా రష్మీ తరచూ జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటూ ఉంటారు. 

 

ఇకపోతే కెరియర్ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా రష్మి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు అయితే తాజాగా ఈమె ఒక వైన్ ఫ్యాక్టరీ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇలా వైన్ ఫ్యాక్టరీలో చక్కర్లు కొడుతూ అక్కడ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇందులో భాగంగా అక్కడ పెద్ద పెద్ద మద్యం సీసాలను అలంకరణలో భాగంగా ఉంచడంతో వాటిని పట్టుకొని ఈమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా సీసాలకు ముద్దులు కూడా పెట్టేస్తున్నారు. 

 

మరికొన్ని ఫోటోలలో వైన్ తాగుతూ చిల్ అవ్వడమే కాకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు ఇలా ఈ ఫోటోలు అన్నింటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇలా చేతిలో మందు గ్లాసుతో కిరాక్ ఫోటోలకు రష్మీ ఫోజులు ఇవ్వడంతో ఇవి చూసినటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Related Posts