పవన్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్

పవన్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్

విడిపోయి పదేళ్లు అవుతున్నా పవన్, రేణూ దేశాయ్ టాపిక్ ఇప్పటి హాట్ హాట్ గానే ఉంటుంది. అందుకే.. ఇప్పటికి చాలా మంది రేణూ దేశాయ్ ను పవన్ మాజీ భార్య అనే అంటారు. కానీ.. పవన్ ప్రస్తావన లేకుండా ఆమెనే పిలవరు. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చాలా సామాజిక అంశాలపై రెస్పాండ్ అవుతారు. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఫ్యాన్ భేష్ ఉంది. ఆమె పెట్టిన ప్రతీ పోస్టు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

సోషల్ మీడియాలో రేణూదేశాయ్ పెట్టిన పోస్టులకు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ ఆమెను ఇబ్బంది కలిగిస్తాయి. ఆ కామెంట్స్ పాజిటివ్ గా ఉన్నా రేణూ దేశాయ్ ఇబ్బంది పడతారు. దానికి కారణం.. ప్రతీ విషయంలో పవన్ కల్యాణ్ తో పోల్చుతూ కామెంట్స్ పెడతారు. దీంతో ఆమె కాస్తా ఇబ్బంది పడి.. ఘాటుగానే రియాక్ట్ అవుతారు. రీసెంట్ గా ఆమె అనాధ పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తూ ఓ పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్ పవన్ కల్యాణ్ లాగే మీరు కూడా గోల్డ్ హార్ట్ ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశారు. దీనిపై ఆమె ఫైర్ అయ్యారు. ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు పోల్చుతారు అని మండిపడ్డారు. పవన్ కు పెంపుడు జంతువులపై ప్రేమ ఉండదు. కానీ.. నాకు చిన్నప్పటి నుంచే పెట్స్ అంటే ఇష్టం అని చెప్పారు. పవన్ నా భర్త కాదు.. అతనితో నన్న పోల్చొద్దని గట్టిగా రియాక్ట్ అయ్యారు.

అయితే ఇప్పుడు రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మరో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను ఇండైరెక్ట్‌గా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. జానీ సినిమాలో పవన్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ' ఇది నేనేనా? నమ్మలేకపోతున్నా'  అని రాసుకొచ్చారు. అంతేకాదు.. రెండు లవ్ సింబల్స్ కూడా జత చేశారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related Posts