సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ గా రష్మిక.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
సౌత్ ఇండియాలో ఇప్పుడు ఎవరు నెంబర్ వన్ హీరోయిన్ అంటే మొన్నటి వరకు అందరూ నయనతార పేరు చెప్పేవారు. ఎందుకంటే రెమ్యునరేషన్ పరంగా నయన్ ఎక్కువగా తీసుకునేది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆమెను రష్మిక వెనక్కు నెట్టేసింది.
రష్మిక మొన్న నటించిన యానిమల్ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ మూవీ ఏకంగా రూ.900 కోట్ల వరకు రాబట్టింది. దాంతో ఇప్పుడు రష్మికకు బాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లోనే ఈ మూవీ వస్తోంది.
ఈ మూవీ కోసం రష్మిక ఏకంగా రూ.13 కోట్ల వరకు తీసుకుంటోంది. ఇప్పటి వరకు సౌత్ లో నయన్ కంటే ఎవరూ ఎక్కువ తీసుకోలేదు.అ యితే మొదటిసారి రష్మిక ఆమెను దాటేసింది. దాంతో ఇప్పుడు రష్మిక సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ గా అవతరించింది. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్ కూడా ఇంత భారీ మొత్తంగా రెమ్యునరేషన్ అందుకోలేదనే చెప్పుకోవాలి.