ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ విషెస్ తెలిపిన రామ్ చరణ్
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే కానుకగా 'దేవర' నుంచి సాంగ్ రిలీజ్ చేయగా అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది. దీంతో నెట్టింట, బయట ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ చేశారు. ఇందులో RRR సినిమాలో వీళ్లిద్దరూ ఉన్న ఫోన్ ను షేర్ చేస్తూ ' Happiest birthday to my dearest Tarak" అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024