చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్.. మెగా ఫ్యామిలీ సంబురాలు..!
మెగాస్టార్ ఇంటికి పవన్ కల్యాణ్
ఆయన వెంట కొడుకు అకీరా, భార్య
పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేనగా నిలిచింది. పైగా గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్.. ఇప్పుడు బంపర్ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఆయన కీలకం కాబోతున్నారు.
ఈ క్రమంలోనే భారీ విజయం సాధించిన సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. రామ్ చరణ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. సురేఖ స్వయంగా హారతి ఇచ్చి లోపలకు తీసుకెళ్లింది. పవన్ సోదరీమణులు ఆయనకు దిష్టి తీశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిరంజీవి రాగానే ఆయన కాళ్లు మొక్కారు. తల్లి అంజనమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత విజయోత్సవంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ గెలుపు సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలుచేసుకుంది. పవన్ వెంట కొడుకు అకీరా, భార్య అన్నా లెజినోవా ఉన్నారు.