మా వాడైనా పరాయి వాడే.. నాగబాబు కౌంటర్ బన్నీకేనా?
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మరోసారి చిచ్చు పెట్టాయి. ఇప్పటికే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలియజేయడంతో వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీలో హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతు తెలియజేయకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ ఇప్పటికే మండిపడ్డారు. అయితే తాజాగా నాగబాబు సైతం పరోక్షంగా బన్నీ పేరు ప్రస్తావనకు రాకుండా ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.
ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా సరే పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ చేసిన పోస్ట్ బన్నీని ఉద్దేశించి చేశారని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుపై బన్నీ ఫాన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదే పోస్ట్ కనుక ఎన్నికలకు ముందు చేసి ఉంటే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు డామేజ్ జరిగేదని పలువురు ఈ పోస్టులపై కామెంట్లు చేస్తున్నారు.