నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి డేట్ ఫిక్స్

నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి డేట్ ఫిక్స్

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా స్టార్ హీరోల పిల్లల కోసం మరి ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. మన టాలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ ఉంటుంది. కొన్ని దశాబ్ధలు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వారసులు కోసం ఫ్యాన్స్ చాలా ఏళ్లు ఎదురు చూశారు. చిరంజీవి తర్వాత వారసుడి రామ్ చరణ్ వచ్చి గ్లోబల్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చి సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వెంకటేష్ కొడుకులు లేరు కాబట్టి.. రానానే వారసుడిగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 

ఇక మిగిలింది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ . చిరంజీవితో సమానంగా ఇమేజ్ సొంతం చేసుకున్న బాలకృష్ణ వారసుడికి ఎంట్రీ ఇవ్వడంలో బాగా లేట్ చేశారు. కానీ.. ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. చాలా ఏళ్లగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ.. ఒక్కటి కూడా నిజం కాలేదు. బాలయ్యను దీనిపై అడిగితే.. ఇదిగో.. అదిగో అంటున్నారు. అయితే.. మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదిలోనే జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

 

ప్రస్తుతం కథను ఎంచుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడని టాక్ నడుస్తోంది. స్టోరీ ఫైనల్ అవ్వగానే వెంటనే షూటింగ్ ప్రారంభం కానుందని ఫిలింనగర్ టాక్. దీంతో ఈ విషయం బయటకు రావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ డైరెక్టర్, ఏ హీరోయిన్‌తో చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో మొదలెట్టారు నెటిజన్లు. అయితే బాలయ్యకు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత తెలియాల్సి ఉంది.

Related Posts