అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒకే వేదికపై చైతన్య, సమంత 

అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒకే వేదికపై చైతన్య, సమంత 

టాలీవుడ్‌లో ఒకప్పటి క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య. కెరీర్ ప్రారంభం నుంచి లవ్ చేసుకున్న ఈ జంట పదేళ్ల తర్వాత వివాహ బంధంతో ఒకటి అయ్యారు. అయితే.. సడెన్‌గా మూడేళ్లు క్రితం విడిపోతున్నట్టు ప్రకటించి ఇద్దరూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. నాగచైతన్య, సమంత విడిపోయి మూడేళ్లు అవుతున్నా అక్కినేని అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. సందర్భం దొరికిన ప్రతీసారీ వీరిద్దరు కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. చైత, సామ్ మళ్లీ కలుస్తారని కూడా చాలా సార్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్నాళ్లకు అభిమానుల కోరిక నిజం కాబోతుంది. సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారు. అయితే.. జీవితంలో కలవడం కాదు. ఓ సినిమా ఈవెంట్‌లో కలవనున్నారు.  

 

విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో 2014లో వచ్చిన సినిమా ‘మనం’. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీలో మూడు జనరేషన్లు నటించాయి. అక్కినేని నాగేశ్వర రావు, కింగ్ నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, శ్రియ శరణ్, అమల, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఒకే స్క్రీన్‌పై అక్కినేని ఫ్యామిలీని చూసి నాగ్ అభిమానులే కాకుండా సినిమా ఆడియన్స్ అంతా వావ్ అన్నారు. 2014లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా మంచి మార్కులు కొట్టింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో విక్రమ్ కే కుమార్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు.

 

అయితే ఈ సినిమా విడుదలై ఏకంగా 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మేకర్స్ మే 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటనను కూడా విడుదలైంది. ఈ రీరిల్ ఫంక్షన్‌కి మనం యూనిట్ మొత్తం వస్తుంది. దీంతో.. ఈ సినిమాలో కీ రోల్ చేసిన సమంత కూడా వస్తున్నారు. దీంతో.. కనీసం ఇలా అయినా సమంత, చైతన్యను ఒకే ఫ్రేమ్‌లో చూసుకుంటామని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts