భోజనం తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా.. చాలా డేంజర్..!
On
మన దేశంలో చాలా మందికి పొద్దున్నే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. రోజులో కాఫీ గానీ, టీ గానీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు. అయితే కొందరు తిన్న తర్వాత కూడా టీ, కాఫీలు తాగుతుంటారు. తిన్న వెంటనే ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చెబుతున్నారు డాక్టర్లు.
ఎందుకంటే కాఫీ, టీలలో కెఫెన్ అనే ఒక రసాయనం ఉంటుంది. అది తిన్న ఆహారం నుంచి ఐరన్ తో పాటు చాలా రకాల పోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాంతో తిన్న ఆహారం నుంచి మన బాడీ ప్రయోజనాలు పొందలేకపోతుందని ఐసిఎంఆర్ కొన్ని సూచనలు చేసింది.
కాబట్టి కాఫీ, టీలు తాగడానికి గంట ముందు లేదా తిన్న తర్వాత గంటలోపు అస్సలు తాగొద్దని చెబుతున్నారు. అంతే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగినా అల్సర్ లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.