అతనితో లిప్ కిస్ తప్పనిపించలేదు.. : ఆమని
ఒకప్పుడు హీరోయిన్లు మెరిసిన వారు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణిస్తున్నారు. హీరోయినలకు అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు. అలాంటి వారిలో నటి ఆమని కూడా వస్తుంది. ఆమె చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ నటుడు నరేశ్ తో చందమామ కథలు సినిమాలో లిప్ కిస్ సీన్ చేసింది. ఈ వయసులో ఇలా చేయడం ఏంటని అప్పట్లో ఆమెపై దారుణమైన విమర్శలు వచ్చాయి. అయితే వాటిపై ఆమని మరోసారి స్పందించింది. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా బోల్డ్ సినిమాలు చాలానే చేశాను.
నరేశ్ తో తొలినాళ్లలో కూడా క్లోజ్ గా నటించాను. అందుకే నాకు సెకండ్ ఇన్నింగ్స్ లో చేయడం తప్పనిపించలేదు. అవన్నీ సినిమాలో భాగం మాత్రమే. సినిమాల్లో రాణించాలంటే అన్నీ చేయాలి. అవి చేయను, ఇవి చేయను అని కూర్చుంటే నడవదు. ఇక్కడ రాణించాలంటే ప్రతి ఒక్కటీ సవాల్ గానే తీసుకోవాలని చెప్పుకొచ్చారు ఆమని. ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.