కమల్ హాసన్, కీర్తిసురేశ్‌లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు
‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల జాబితాను ప్రకటించారు. 2022లో విడుదలై.. మెప్పించిన సినిమాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆ సంస్థ వెల్లడించింది.
‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల జాబితాను ప్రకటించారు. 2022లో విడుదలై.. మెప్పించిన సినిమాలకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆ సంస్థ వెల్లడించింది. 'విక్రమ్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. 'సాయి కాయిదం' చిత్రానికిగానూ కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా ఎంపికైంది.
జపాన్‌లోని ఒసాకా నగరం ఈ అవార్డుల వేడుకకు వేదికగా మారింది. ఈ ఈవెంట్ కోలీవుడ్, జపాన్ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలుస్తోంది. అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీలో రవివర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 1), బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్స్‌గా రత్నకుమార్, లోకేశ్ కనగరాజు(విక్రమ్), బెస్ట్ కొరియోగ్రాఫర్‌కుగాను జానీ మాస్టర్(అరబిక్ కుతు పాట) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫహాద్ ఫాజిల్ (విక్రమ్), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఐశ్వర్యారాయ్(పొన్నియిన్ సెల్వన్ 1), బెస్ట్ విలన్‌గా విజయ్ సేతుపతి(విక్రమ్) నిలిచారు.
అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం(పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ (విక్రమ్ సినిమా) ఎంపికయ్యారు. అత్యధికంగా 'విక్రమ్' 8 విభాగాల్లో, 'పొన్నియిన్ సెల్వన్ 1' 7 విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా 'లవ్ టుడే' సత్తా చాటింది.