విమానంలో వ్యక్తి నగ్నంగా పరుగులు.. హడలెత్తిన ప్రయాణికులు

విమానంలో వ్యక్తి నగ్నంగా పరుగులు.. హడలెత్తిన ప్రయాణికులు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.  

విమానంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎమెర్జెన్సీ డోర్ తెరవడం, సిబ్బందిని గాయపరచడం వంటివి తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.  

ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారంరాత్రి బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యలకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

మరోవైపు విమాన సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. ‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:

Related Posts