బుర్రకథకు అరుదైన గౌరవం.. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక
తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన గౌరవం దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘శాంసన్ అండ్ దెలీలా’ అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్ రావు, వసంతరావు, సుశీల్ రావు ముగ్గురు సోదరులు ప్రదర్శించారు.
తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన గౌరవం దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘శాంసన్ అండ్ దెలీలా’ అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్ రావు, వసంతరావు, సుశీల్ రావు ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్ కథ ఆధారంగా శాంసన్ అండ్ దెలీలా బుర్ర కథను రూపొందించారు.
అదేవిధంగా చిల్కూరి బుర్రకృథ బృందం 1970 చివర, 1980 తొలినాళ్లలో తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. అప్పటినుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చింది. మరోవైపు ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న శాంసన్ అండ్ దెలీలా బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ కథను ప్రధాన కళాకారుడు చిల్కూరి వసంతరావు అద్భుతంగా ప్రదర్శించారు. ప్రేమ, ద్రోహం అలాగే ఎదురించి పోరాడటం వంటి అంశాలను తన కథలో చక్కగా వివరించారు.