హజ్ యాత్రలో అపశృతి.. 19మంది యాత్రికులు మృతి

హజ్ యాత్రలో అపశృతి.. 19మంది యాత్రికులు మృతి

  • 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
  • మృతులు జోర్డాన్, ఇరాన్ దేశస్థులుగా గుర్తింపు

ముస్లింలకు ఎంతో పవిత్రమైన హజ్ యాత్రలో అపశృతి నెలకొంది. అక్కడి ఎండ వేడిమిని తాళలేక 19 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14మంది జోర్డాన్ దేశస్థులు కాగా ఐదుగురు ఇరాన్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన యాత్రికుల రద్దీ దృష్ట్యా మరణాలు తీవ్రతరమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

దీంతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో 240 మంది మృతిచెందారు. ఇదిలా ఉండగా, రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు 17మంది యాత్రికులు తప్పిపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ధ్రువీకరించింది. ఈద్-ఉల్-అజా పండుగ కోసం సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. 

Read More వయనాడ్ లో ఘోర విలయం.. 47కు పెరిగిన మృతుల సంఖ్య

అయితే..ఇక్కడ తీవ్రమైన ఎండలు, వేడితో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ ఏడాది హజ్ యాత్రలో 1.8 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ యాత్ర బుధవారంతో ముగియనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు తీవ్ర ఎండలు ఉంటాయని, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సౌదీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Related Posts