తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ బందోబస్తు?
తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగుసాయి. మే 13వ తేదీ జరిగినటువంటి ఈ ఎన్నికలు అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధమైనటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ విధంగా ఎన్నికల పూర్తి కావడంతో ఎన్నికల కేంద్రాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నాయి. ఎన్నికల అధికారులు కలెక్టరేట్ల సమక్షంలో ఈవీఎం వివి ప్యాట్లను భద్రపరిచారు. ఇకపోతే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ స్థాయిలో బందోబస్తును కూడా నిర్వహించారు. ఈ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఎన్నికల అధికారులు 144 సెక్షన్ కూడా అమలు చేశారు.
కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడింతల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ తెలియజేయునున్న సంగతి తెలిసిందే అప్పటివరకు ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయడమే కాకుండా అందుబాటులో అగ్నిమాపక సిబ్బంది ఉంటున్నారు.