భర్తను కొట్టిన వైన్‌షాప్ సిబ్బందిపై భార్య దాడి..!

భర్తను కొట్టిన వైన్‌షాప్ సిబ్బందిపై భార్య దాడి..!

ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. భర్త మందు అడిగితే కొట్టారనే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వైన్‌ షాప్‌ సిబ్బందిపై దాడికి చేసింది. అడ్డొచ్చిన పోలీసులనూ వదల్లేదు.

భర్త కొట్టాడనో, తిట్టాడనో పుట్టింటికి వెళ్లే భార్యలను చూసి ఉంటాం. కానీ ఓ మహిళ భర్త కోసం ఏకంగా ప్రతీకార దాడికి దిగింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. భర్త మందు అడిగితే కొట్టారనే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వైన్‌ షాప్‌ సిబ్బందిపై దాడికి చేసింది. అడ్డొచ్చిన పోలీసులనూ వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసముంటోంది. 

మద్యం కొనేందుకు అక్కడే వైన్‌ షాప్‌ వద్దకు వెళ్లి ఓ వ్యక్తి మద్యం ఇవ్వాలని అడిగాడు. దీంతో అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మద్యం అడిగిన వ్యక్తిపై వైన్‌ షాప్‌ సిబ్బంది దాడి చేశారు. ఆవ్యక్తి తల పగల గొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో భర్తను రక్తంతో చూసిన భార్యకు ఏం జరిగిందో తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంకేముంది వైన్‌ షాప్‌ వద్దకు చేరుకుని అక్కడి సిబ్బందిపై దాడికి దిగింది. స్థానికులు అడ్డుకున్నా ఎవరిమాటా లెక్కచేయకుండా వైన్ షాపులోకి జొరబడి సిబ్బందిపై దాడికి దిగింది. 

Read More జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ పోలీసులనీ చూడకుండా వారి జుట్టుపట్టుకుని కొట్టింది. దాడి చేసిన వారిని వదిలేసి తనను, తన భర్తను అడ్డుకుంటారా? అని ప్రశ్నించింది. దీంతో దాడి చేసిన మహిళపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.