కరీంనగర్‌ వివాదంలో ట్విస్ట్.. కత్తి తిప్పి రచ్చ చేసిన వ్యక్తి ఎవరంటే..?

కరీంనగర్‌ వివాదంలో ట్విస్ట్.. కత్తి తిప్పి రచ్చ చేసిన వ్యక్తి ఎవరంటే..?

హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని సమాచారం. అతడు శోభాయాత్రలో కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించి హనుమాన్ భక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ కార్యకర్త అని, బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడని పోలీసులు తేల్చారు. 

కరీంనగర్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హనుమాన్ శోభాయాత్రలో అగంతకుడు సృష్టించిన గొడవ, లాఠీచార్జ్‌ చేయడంతో పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు హనుమాన్ దీక్ష స్వాములతో పాటు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.

అయితే హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని సమాచారం. అతడు శోభాయాత్రలో కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించి హనుమాన్ భక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ కార్యకర్త అని, బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడని పోలీసులు తేల్చారు. 

Read More రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్ 

అయితే ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని హనుమాన్ భక్తులను  బీజేపీ శ్రేణులు ఉసిగొలిపి రాద్దాంతం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హనుమాన్ భక్తుల, బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసుల తీరుపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన కరీంనగర్‌కు బయలుదేరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలేం జరిగిందో తెలుసుకుని డీజీపీతో ఫోన్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.