విషాదం: విద్యుదాఘాతంతో స్తంభంపైనే లైన్‌మెన్ మృతి

విషాదం: విద్యుదాఘాతంతో స్తంభంపైనే లైన్‌మెన్ మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూనియర్ లైన్‌మెన్‌ విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతిచెందాడు. విద్యుత్ స్తంభంపై వైర్లు సవరిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు.

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూనియర్ లైన్‌మెన్‌ విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతిచెందాడు. విద్యుత్ స్తంభంపై వైర్లు సవరిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లిలో జరిగింది.

వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన బాల్ రాజు గత అక్టోబర్‌లో మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి జూనియర్ లైన్‌మెన్‌గా నియామకమయ్యాడు. కాగా, శుక్రవారం ఉదయం గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో బాల్ రాజు స్తంభంపైకి ఎక్కి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ క్రమంలో స్తంభంపై ఉన్న విద్యుత్ తీగలకు చిక్కుకొని ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Read More కోటి మెటర్నటీ హాస్పిటల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ -ఆర్యవైశ్య మహాసభ

Tags: