భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున 3.35గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు.

రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున 3.35గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకునిమంటలను అదుపు చేశారు. 

ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతులు జగదీష్ కుమారుడు శ్యామ్ (24), గిర్జా శంకర్ కుమారుడు రామ్ సింగ్ (30), రాజారాం కుమారుడు బీరా పాల్ (42)గా గుర్తించారు. రాకేష్ శర్మ, కన్హయ్య లాల్, రాజు కుష్వాహ, జైకిషన్, జగదీష్ నారాయణ్ శర్మ, బన్ లాల్ కుష్వాహ గాయాలపాలైన వారిలో ఉన్నారు. పైప్‌లైన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫ్యాక్టరీ యజమానులు అంకిత్ గుప్తా, వినయ్ గుప్తాలను విచారిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts