ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి

ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి

ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లోని పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.

ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లోని పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడటంతో ఏడుగురు శిశువులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో 12 మంది చిన్నారులను సహాయక బృందం రక్షించింది. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts