Nandyala: పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
On
ఏపీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా శివశంకర్ రెడ్డి(46) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలీదు.. ఆయన ఉన్నట్టుండి రెస్ట్ రూమ్‌లో అర్ధరాత్రి గన్‌తో కాల్చుకున్నాడు. శివశంకర్ రెడ్డి కర్నూలు వాసి అని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.