Attack on couple: అమానుషం.. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని దంపతులపై దాడి..!
నగరంలోని మధురానగర్ పరిధి రహమత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనాథ్ ఇంట్లోని పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
చిన్నపాటి కారణాలకే గొడవలకు దిగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాతకక్షను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. పెంపుడుకుక్క ఇంట్లో చొరబడిందని ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి దంపతులపై దాడికి తెగబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మధురానగర్ పరిధి రహమత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనాథ్ ఇంట్లోని పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న ధనుంజయ్ అదను చూసి తన స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌తో పాటు అతడి భార్యపై దాడికి దిగాడు.
కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్, అతడి భార్య, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు.