జీతాలురాక మనస్తాపం.. గుండెపోటుతో అంబులెన్స్ డ్రైవర్ మృతి!

జీతాలురాక మనస్తాపం.. గుండెపోటుతో అంబులెన్స్ డ్రైవర్ మృతి!

తోటి ఉద్యోగితో విధుల కోసం బైక్‌పై వెళ్లి కార్యాలయానికి తిరిగొస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సీపీఆర్ చేసి చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

 జీతాలు రాక మానసిక ఒత్తిడికి గురైన ఓ అంబులెన్స్ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దాపూర్‌కు చెందిన రాజకుమార్ (52) జగిత్యాలలో 104 అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

తోటి ఉద్యోగితో విధుల కోసం బైక్‌పై వెళ్లి కార్యాలయానికి తిరిగొస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సీపీఆర్ చేసి చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 104 సిబ్బందికి వేతనాలు మంజూరు కాకపోవడం, జగిత్యాల డీఎంహెచ్‌వో శ్రీధర్ వేధింపుల కారణంగా రాజకుమార్ మనస్తాపంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు, 104 సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Read More రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకే మా పోరాటం:ధర్మ సమాజ్ పార్టీ