ప్రియుడి కోసం.. భర్తని హత్య చేయించిన భార్య

ప్రియుడి కోసం.. భర్తని హత్య చేయించిన భార్య

  • అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ
  • ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి.. 

ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్‌కు చెందిన టీచర్‌ జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌, రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అయితే, భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు నేరస్తులు ఎవరనేది బయటపెట్టారు. మృతుడు జైనథ్ భార్య మహేష్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండాలంటే.. తన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. 

Read More చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు

ఈ క్రమంలో భర్త మృతిచెందినా.. తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని, ఒక సుపారీ గ్యాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడి డీల్ కుదుర్చుకుని వారితో హత్య చేయించింది. అయితే, భర్త హత్య జరిగిన రెండురోజుల తర్వాత భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండురోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదని కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. కాగా, పోలీసులు ఆ మహిళతో పాటు హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.