బావిలో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

బావిలో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన జరిగింది.

దావులూరి వర్ష (22) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

అయితే, ప్రస్తుతం వర్ష భర్త అమెరికాలో ఉంటున్నారు. కాగా, అనారోగ్య కారణాలతోనే వర్ష ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More కోటి మెటర్నటీ హాస్పిటల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ -ఆర్యవైశ్య మహాసభ

Tags: