వెజ్ భోజనంలో పురుగుల విందు

వెజ్ భోజనంలో పురుగుల విందు

భోజనం చేద్దామని హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి బిగ్ షాక్ తగిలింది. ఫుడ్ ఆర్డర్ చేసి సగం తిన్న అతడి ప్లేట్లో పురుగు కనిపించడంతో అవాక్కయ్యాడు ఆ వ్యక్తి.

విశ్వంభర, షాద్ నగర్ : భోజనం చేద్దామని హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి బిగ్ షాక్ తగిలింది. ఫుడ్ ఆర్డర్ చేసి సగం తిన్న అతడి ప్లేట్లో పురుగు కనిపించడంతో అవాక్కయ్యాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలోని యమ్మీ హోటల్లో జరిగింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం యమ్మీ హోటల్లో వెజ్ రైస్ ఆర్డర్ చేశాడు. సగం భోజనం చేసిన తర్వాత అన్నంలో పురుగు కనిపించింది. షాక్‌కు గురైన ఆ వ్యక్తి హోటల్ యజమానిని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని చెప్పాడు.  అయితే హోటల్ యజమాన్యం నిర్లక్షం కారణంగానే భోజనంలో పురుగు వచ్చిందని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేరుకు పెద్ద హోటళ్లు.. భోజనం నాసిరకం అంటూ ఫైర్ అయ్యాడు. నిర్లక్షంగా వ్యవహరిస్తున్న హోటళ్లపై ఫుడ్ ఇన్ స్పెక్టర్ చర్యలు తీసుకోవాలని, వెంటనే హోటల్‌ను మూసివేయాలని భోజనప్రియులు డిమాండ్ చేశారు.

 

Related Posts