రామోజీ రావుకు షూటింగ్ స్పాట్‌లోనే నివాళులు

రామోజీ రావుకు షూటింగ్ స్పాట్‌లోనే నివాళులు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో ఉన్న రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌లు షూటింగ్ స్పాట్‌లోనే నివాళులర్పించారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో ఉన్న రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌లు షూటింగ్ స్పాట్‌లోనే నివాళులర్పించారు. వారితో పాటు నటులు సునీల్, రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.

రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హీరో రామ్ చరణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో జరిగే గేమ్ చేంజర్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ రాత్రి అక్కడే బస చేశారు. బొబ్బర్లంకలో శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా నిర్మితమవుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటారు.

Read More రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్