తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు

తిరుమలలో ఈసారి రెండు చిరుతలు.. భయం గుప్పిట్లో శ్రీవారి భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఈసారి ఏకంగా రెండు చిరుతలు కనిపించి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుత పులులు ఎదురయ్యాయి. భక్తులకు సమీప దూరంలోనే చెట్ల పొదల్లో కనిపించాయి. దీంతో.. భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. అయితే మళ్లీ వస్తాయేమోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారాన్ని టీటీడీ అధికారులకు అందించారు. దీంతో.. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

చిరుతలను బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా మెట్లపై నడవొద్దని తెలిపారు. గుంపులు వెళ్లాలని అన్నారు. భక్తులు తమతో వచ్చే వృద్ధులు, చిన్న పిల్లలను తమ వెంటే పెట్టుకోవాలని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే చిరుతలను పట్టుకుంటామని అన్నారు. ఇప్పటికే బోనులు ఏర్పాటు చేశామని చెప్పారు. చిరుతలు చిక్కే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

టీటీడీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. భక్తులకు చిరుత పులుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చాలా సార్లు తిరుమలలో హల్ చల్ చేశాయి. గతంలో భక్తులపై దాడి చేసి గాయపడ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. చిరుత దాడి చేసిన తర్వాత టీటీడీ భక్తులకు చేతికర్రలు కూడా అందిస్తోంది. అయినా.. తరచూ చిరుతల సంచారం భక్తులను కలవపెడుతున్నాయి. ఐదు రోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులో ఓ భక్తుడి కారుకు చిరుత అడ్డొచ్చింది. ఆ దృశ్యాలు సీసీ పుటేజీ‌లో కనిపించాయి.

Related Posts