దేశంలోనే ధనిక ఎంపీలు తెలుగువాళ్లే

దేశంలోనే ధనిక ఎంపీలు తెలుగువాళ్లే

మొదటి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్
రెండో స్థానంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి

 

2024 లోక్ సభ ఎన్నికలకు కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో అత్యధిక ధనవంతులు ఎవరనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈ అవకాశం మన తెలుగు వారికే దక్కింది. ఇద్దరు తెలుగు వాళ్లే టాప్-1, 2 స్థానాల్లో ఉన్నారు. వారు ఎన్నికల కమిషన్ కు అందించిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు ఎంపీగా గెలిచిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యధిక తనవంతుడైన ఎంపీగా నిలిచారు. 

Read More తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.

ఈయన తన ఆస్తులను రూ. 5,705 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. ఈయన వృత్తిరీత్యా డాక్టర్. అయితే ఒక డాక్టర్ కు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయన పేరు మీద రూ.2వేల కోట్లు, భార్య పేరు మీద మరో రెండువేల కోట్లు, కొడుకు, కూతురు పేరు మీద కలిపి మరో వెయ్యి కోట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు.

తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి రూ.4,568 కోట్లతో రెండో ధనిక ఎంపీగా నిలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో అఫిడవిట్ లో తన ఆస్తులు రూ.895 కోట్లుగా చూపించారు. కానీ ఈ ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ఇలా వీరిద్దరూ దేశంలోనే ధనవంతులైన ఎంపీలుగా రికార్డు నెలకొల్పారు.