సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

 

విశ్వంభర, ఉండవల్లిః  తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఏపీకి వెళ్లారు. ఉండవల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికి ఒకరు శాలువాలతో సత్కరించకున్నారు. బొకేలు అందజేసుకున్నారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

అంతకు ముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. పూల బొకేతో సన్మానించారు. ఇక సీఎం చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం ఇంద్ర కీలాద్రిలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. 

పూర్ణకుంభంతో ఆయన్ను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాధాకృష్ణన్ తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో కూడా అధికారులు ఆయనకు భారీగా స్వాగతం పలికారు.