గర్వంగా ఉంది.. అకీరా, పవన్ ఫొటోపై రేణూ దేశాయ్ ఎమోషనల్..!

గర్వంగా ఉంది.. అకీరా, పవన్ ఫొటోపై రేణూ దేశాయ్ ఎమోషనల్..!

నరేంద్రమోడీని కలిసిన పవన్, అకీరా
తాను బీజేపీ వ్యక్తినే అంటున్న రేణూ దేశాయ్

విశ్వంభర, హైదరాబాద్ : ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అందరి చూపు ఇప్పుడు పవన్ కల్యాణ్‌ మీదనే ఉంది. అయితే పవన్ కల్యాణ్‌ కూడా తాను ఎక్కడకు వెళ్తే అక్కడకు తన కొడుకు అకీరా నందన్ ను తీసుకెళ్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు కూడా అకీరా వెంట ఉన్నాడు. 

ఇక తాజాగా గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్‌ తన కొడుకు అకీరా, భార్య అన్నా లెజినోవాతో కలిసి కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దాంతో రేణూ దేశాయ్ కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను మొదటి నుంచి బీజేపీ వ్యక్తిని. నాకు ప్రధాని మోడీ అంటే ఎంతోఇష్టం. ఆయన్ను ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

కానీ ఈ రోజు నా కొడుకు అకీరానందన్ మోడీ పక్కన ఉండటం చూస్తే గర్వంగా ఉంది. మోడీని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేశాడు. మోడీలో మ్యాజిక్ ఉందని.. ఆయన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని.. అందుకే ఆయన స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారని అకీరా చెప్పాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

 

Related Posts