పవన్, లోకేష్ మంత్రి పదవులు చేపట్టరా..?

పవన్, లోకేష్ మంత్రి పదవులు చేపట్టరా..?



ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని పవన్ భావిస్తున్నారా..
పార్టీ కార్యక్రమాలు చూడనున్న లోకేష్..?

 

ఏపీలో ఇప్పుడు కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమిలో టీడీపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. కాబట్టి జనసేన, బీజేపీ అవసరం లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే అటు టీడీపీలో కీలక నేతగా లోకేష్, ఇటు జనసేనలో పవన్ ఉన్నారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

వీరిద్దరి మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రేపటి రాజకీయాలు వీరిద్దరి చుట్టే తిరగబోతున్నాయి. అయితే వీరిద్దరూ కచ్చితంగా మంత్రి పదవులు తీసుకుంటారిన అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే వీరిద్దరూ వాటికి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న పవన కల్యాణ్‌ మాట్లాడుతూ.. తాను బాధ్యతగల ప్రతిపక్ష హోదాలో ఉంటానని చెప్పడం గమనార్హం.

వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి.. ఆ బాధ్యతను జనసేన తీసుకుంటే.. భవిష్యత్ లో పార్టీ బలంగా మారుతుందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు లోకేష్ విషయానికి వస్తే.. ఆయన పార్టీలో ఇంకా పట్టు పెంచుకోవడం కోసం ప్రభుత్వంలో కాకుండా పార్టీ కార్యక్రమాలను చూసుకోవాలని భావిస్తున్నారంట. ఈ కారణాల వల్ల వీరిద్దరూ ప్రభుత్వంలో ఉండరని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.

Related Posts