జులై 1 నుంచి కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన
On
విశ్వంభర, అమరావతిః ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జులై నెలలో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1వ తేదీన ఆయన కాకినాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదే రోజున పిటాపురం జనసేన నేతలతో సమావేశం అవుతారు. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు.
Read More ఘనంగా కబడ్డీ పోటీలు
ఆ తర్వాత రోజున అంటే జులై 2న ఆయన కాకినాడ కలెక్టరేట్ లో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు. ఆయా శాఖలలో ఎలాంటి పనులు జరుగుతున్నాయనే వాటిపై ఆయన కూలంకుశంగా చర్చించి ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత జులై 3న పిఠాపురంలో వారిహి కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. ఇందులో తనను గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.