ఆపరేషన్ కంబోడియా సక్సెస్..360 మంది ఇండియన్స్ సేఫ్

ఆపరేషన్ కంబోడియా సక్సెస్..360 మంది ఇండియన్స్ సేఫ్

విశాఖ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కంబోడియా సక్సెస్ అయింది. ఏపీ నుంచి వెళ్లి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి లభించింది. ఉద్యోగాల కోసం ఏపీ నుంచి కంబోడియా వెళ్లి అక్కడ సైబర్ మోసానికి గురైయ్యారు. విశాఖ వాసులు కూడా ఇందులో ఉండటంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో.. విశాఖ పోలీసులు భారత ఎంబసీ అధికారులను సంప్రదించి ఆపరేషన్ కంబోడియా చేపట్టారు. 

 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

దీనిపై కూపీ లాగగా 420 భారతీయులు కంబోడియాలో చిక్కకున్నట్టు గుర్తించారు. భారత ఎంబసీ సాయంతో 360 మందిని కంబోడియా పోలీసుల చెర కాపాడారు. ఎట్టకేలకు బాధితులు భారత్ చేరుకున్నారు. ఇందులో విశాఖకు చెందిన 60 మంది ఉన్నారు. కాగా.. కంబోడియాలో మంచి ఉద్యోగం, మంచి జీతం అంటూ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటనను చూసి యువత అప్లైయ్ చేశారు.

 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

ఏపీ నుంచి ఏకంగా 150 మంది నిరుద్యోగులు ఈ ట్రాప్ లో పడ్డారు. వారి నుంచి లక్షన్నర తీసుకొని.. బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కంబోడియాకు తరలించారు. అక్కడ ఓ గ్యాంగ్ చైనా ముఠాకు అమ్ముకున్నారు. ఆ ముఠా నుంచి 4 వేల డాలర్లు తీసుకున్నారు. అయితే.. ఇలా ట్రాప్ అయిన వారిలో బొత్స శంకర్ అనే వ్యక్తి వారి నుంచి తప్పించుకొని వచ్చి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ బయటకు వచ్చింది.

Related Posts