ఆ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం: సీపీఐ నారాయణ

ఆ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం: సీపీఐ నారాయణ

బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందని పేర్కొన్నారు. 

అదేవిధంగా ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని నారాయణ విమర్శించారు. ఏపీలోనూ ప్రభుత్వం మారుతుందని జోస్యం చెప్పారు. మరోవైపు ముస్లింలు సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అని ధ్వజమెత్తారు. అలాగే ప్రస్తుతం 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

మోడీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా ఆయన కూతురు కవితను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అందులో ఇరికించారని అన్నారు. మోడీ పతనం ప్రారంభమైందని... బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ నారాయణ మండిపడ్డారు.

మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఎన్డీఏ కూటమికి భారీగా సీట్లు తగ్గనున్నాయని నారాయణ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారిపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయని విమర్శించారు.