ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. లక్ అంటే చంద్రబాబుదే..!
కేంద్రంలో చంద్రబాబుదే పెత్తనం
రాష్ట్రంలో తిరుగులేని అధికారం
తెలంగాణలో ఆయనకు నచ్చిన వ్యక్తే సీఎం
విశ్వంభర, విశాఖపట్నంః రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు.. గత ఐదేండ్లుగా అత్యంత దుర్భర పరిస్థితులు అనుభవించారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. ఐదేండ్లుగా కనీసం సొంత రాష్ట్రంలోనే ఏ మత్రం గుర్తింపు లేని నాయకుడిగా తిరిగారు. అటు కేంద్రంలో అమిత్ షా, మోడీ కూడా ఆయనకు అపాయింట్ కూడా ఇవ్వలేదు కనీసం.
ఆయన గత ఐదేళ్లలో అనుభవించిన కష్టాలు ఎన్నడూ చూడలేదని అంటారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఎన్నడూ ఏడవని చంద్రబాబు.. గతేడాది అసెంబ్లీలో జరిగిన దారుణాన్ని తలచుకుని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతగా బాధలు అనుభవించిన చంద్రబాబుకు ఇప్పుడు తిరుగులేని అదృష్టం పట్టుకుంది.
అది మామూలు లక్ కాదు. ఎందుకంటే ఒకే దెబ్బకు మూడు చోట్ల ఆయన కోరుకున్న పవర్ దక్కింది. ఇటు తెలంగాణలో ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన రేవంత్ సీఎం అయ్యారు. చంద్రబాబు టీడీపీని పోటీ చేయించకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి రేవంత్ ను గెలిపించారని అంటారు. అది ఫలించింది.
ఇక ఎంతో బలంగా కోరుకున్నట్టే ఆయన ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. అదే సమయంలో అటు కేంద్రంలో ఎన్డీయేకు ఇప్పుడు ఆయన దిక్కయ్యారు. మొన్నటి వరకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని మోడీని ఇప్పుడు చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు దయతలిస్తేనే మోడీ పీఎం అవుతున్నారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు కోరుకున్నట్టు మూడు చోట్ల జరిగిందని చెప్పుకోవాలి.