వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం

వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం

సార్వత్రిక ఎన్నిక్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది.

సార్వత్రిక ఎన్నికల్లోఅధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ జెండా పట్టుకుని ఇన్ని రోజులు ప్రచారం చేసిన నేతలు ఆ పార్టీ ఓటమితో ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలను చేస్తున్నది. 

ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో ఆయన పవన్ కల్యాణ్‌లను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం..శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎలాంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు..’ అంటూ పేర్కొన్నారు.  దీంతో ఆయన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts